తిరుమల కుంట వద్ద కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు

భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ తిరుమల కుంట వద్ద కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు భీమ్ ఇండియా టుడే న్యూస్ భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ గ్రామంలోని తిరుమల కుంట వద్ద కల్వర్టు నిర్మించాలని గ్రామ రైతులు చాలాకాలంగా కోరుతున్న నేపథ్యంలో, కల్వర్టు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. వర్షాకాలంలో తిరుమల కుంట మత్తడి పడిన సమయంలో కుంటకు అవతలి వైపు ఉన్న వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ సర్పంచ్ కేతిరి...