సింగపూర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ పర్మనెంట్ సెక్రెటరీ ఆగస్టీన్ లీ

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన ఇంధన – వాణిజ్య విభాగం ప్రకటించింది. సింగపూర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ పర్మనెంట్ సెక్రెటరీ ఆగస్టీన్ లీ గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారితో సమావేశమైంది.  అసెంబ్లీలోని చాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో పారిశ్రామిక పెట్టుబడులపై చర్చలు జరిగాయి. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న సానుకూల అంశాలను ముఖ్యమంత్రి  సమగ్రంగా వివరించారు....