మృతుల కుటుంబాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా…కన్నీటి వేళ.. నేనున్నానంటూ భరోసా…..
హుస్నాబాద్‌లో పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం,
ప్రజల కష్టమే.. నా బాధ్యత, ఓదార్పుతో పాటు విద్యార్థుల
ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి: పొన్నం ప్రభాకర్, కోహెడ, హుస్నాబాద్, చిగురుమామిడి మండలాల్లో మృతుల కుటుంబాలకు పరామర్శ:
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా…కన్నీటి కుటుంబాల్లో ధైర్యం నింపిన మంత్రి.. మృతుల చిత్రపటాలకు నివాళులు:
కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడమే తన బాధ్యత అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంగళవారం పర్యటించిన ఆయన ఇటీవల మృతి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజల కుటుంబాలను పరామర్శించి, వారి దుఃఖంలో తాను భాగస్వామినని భరోసా కల్పించారు.
కోహెడ మండలం శనిగరం గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కర్ర రాజశేఖర్ తల్లి లక్ష్మీబాయి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి.. ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. అలాగే కోహెడ మండలం, హుస్నాబాద్ పట్టణం పరిధిలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను సందర్శించి, మృతుల చిత్రపటాలకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఆరెపల్లి, జిల్లాలగడ్డ, కోహెడ తదితర ప్రాంతాల్లోని మృతుల కుటుంబాలతో పాటు హుస్నాబాద్ పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన కుటుంబాలను మంత్రి పరామర్శించారు. “మీ కష్టసుఖాల్లో నేనున్నాను.. కుటుంబానికి అండగా ఉంటాను” అంటూ బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
చిగురుమామిడి మండలంలో ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ గీకురు రవీందర్ కుటుంబాన్ని కూడా మంత్రి పరామర్శించారు. రవీందర్ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి, స్థానిక ప్రజలకు తీరని లోటని అన్నారు. చిన్నముల్కనూరులో మృతి చెందిన కొయ్యడ రాజ్‌కుమార్ కుటుంబాన్ని సైతం మంత్రి పరామర్శించారు.
ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 16న కరీంనగర్ మార్కెట్ యార్డులో సుమారు రూ.8 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఈ కిచెన్ ద్వారా కరీంనగర్, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లోని 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 49,025 మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందించనున్నారు.
విద్యార్థుల ఆరోగ్యం, ఏకాగ్రత, హాజరు, విద్యా సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.అదేవిధంగా ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల నాని మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్‌లో కలిసి పనిచేసిన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. ఆళ్ల నాని మృతి ప్రజా జీవితానికి తీరని లోటని పేర్కొన్నారు.ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు కష్టాల్లో ఉన్న కుటుంబాలను పరామర్శిస్తూ, వారికి మానసికంగా అండగా నిలవడం ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్ తన మానవీయతను చాటుకున్నారు.