ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో తెలంగాణ ప్రభుత్వం

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఆగా ఖాన్ ఫౌండేషన్ ద్వారా మరింత సహకారం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పని చేద్దామని కోరారు. భారత పర్యటనలో ఉన్న ఆగా ఖాన్ ఫౌండేషన్ చైర్మన్ హిజ్ హైనెస్ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V గారు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి వారితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన ఈ సమావేశంలో...