దళితులను గౌరవించేది ఎవరో గమనించాలి
రాహుల్ గాంధీని చూసి నాయకులు నేర్చుకోవాలి: దళిత నాయకులు భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్, సెప్టెంబర్ 15: దళిత సమాజం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చూపుతున్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని పలువురు దళిత నాయకులు అన్నారు. తరతరాలుగా సామాజికంగా వెనుకబడిన వర్గాల పట్ల గౌరవం, సమానత్వ భావనతో రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు. దళితుల పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని చెప్పుకుంటూ, రాజకీయ అవసరాల కోసం దళితవాడల్లో భోజనాలు చేయడం, వివిధ పథకాల పేర్లు...