అంబేద్కర్‌ను అవమానించిన హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి
హుజురాబాద్‌లో అఖిలపక్ష ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్, సెప్టెంబర్ 15: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ, ఆయనను కించపరిచేలా పుస్తకాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్న హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేయాలని హుజురాబాద్ అఖిలపక్ష ప్రజాసంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం హుజురాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద అఖిలపక్ష ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హమారా ప్రసాద్...