ప్రజా సమస్యలు, శాంతిభద్రతలపై సీఐతో చర్చ
ఎల్కతుర్తి సీఐ కొండ్రు శీనును మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నాయకులు భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి, సెప్టెంబర్ 14: ఎల్కతుర్తి నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన కొండ్రు శీనును దండేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ కొండ్రు శీనుకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. నూతన బాధ్యతల్లో ఆయన విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు సీఐ కొండ్రు శీనుతో కొంతసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. దండేపల్లి గ్రామంతో పాటు...