BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 10:49 pm Posted by : Reporter Srikanth

నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గ నియామకం

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్ )సీనియర్ నాయకులు సంజయ్ సాసానే గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నూతన భీమ్ ఆర్మీ కమిటీ నిర్మాణం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ ( భారత్ ఏక్తా మిషన్ ) అధ్యక్షులు సిద్ధూ రావణ్ గారు విచ్చేశారు. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ అధ్యక్షులు సిద్దు రావణ్ గారు ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడానికి నూతన కమిటీని నిర్మించామన్నారు. ప్రజల హక్కుల కోసం అభివృద్ధి కోసం సామాజిక న్యాయం కోసం అందరం ఐక్యతగా ముందుకు సాగాలని యువతకు ప్రాధాన్యమిస్తూ, పారదర్శకతతో మరియు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు. ప్రజల వద్దకు అడుగు ప్రజా సమస్యలపై పోరాటం అభివృద్ధి కోసం ముందడుగు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాను ఉత్తేజ పరుస్తూ నూతన కమిటీ నిర్మాణం చేయబోతుందని రానున్న రోజుల్లో భీమ్ ఆర్మీ నూతన నాయకత్వంతో , నూతన శక్తితో, నూతన లక్ష్యముతో, విజయమే దిశగా కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అజయ్ రావణ్ గారు మరియు నిజామాబాద్ పట్టణ అధ్యక్షులుగా విజయ్ గారు ఎన్నికయ్యారు వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.