కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డి గణపతి పూజ
విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థన భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్, సెప్టెంబర్ 14: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సమేతంగా గణపతి పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణనాథుడికి కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించి, విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి...