BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 11:26 pm Posted by : Reporter Srikanth

ఆర్ కృష్ణయ్య 72వ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించిన

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ బీసీ జేఏసీ నాయకులు చందుపట్ల జనార్ధన్ సందేళ వెంకన్న బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య 72వ జన్మదిన వేడుకను హుజురాబాద్ నియోజకవర్గం బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న ఆధ్వర్యంలో హుజరాబాద్ పట్టణంలోని స్థానిక జేఎస్ఎస్ కార్యాలయంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా బీసీల అభ్యున్నతి కొరకు పాటుపడుతున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారి సేవలను కొని యా డినారు 1994వ సంవత్సరంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘాన్ని స్థాపించి బలహీనవర్గాల బిడ్డలను చైతన్య పరుస్తూ వారు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదుగుటకు తన వంతు కృషి చేస్తూ బీసీల ఆశాజ్యోతి గా వెలుగొందుతున్న ఆర్ కృష్ణయ్యను ఆదర్శంగా తీసుకొని బీసీ లందరూ ఏకమై స్థానిక సంస్థలు చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్ సాధించేంతవరకు ముందుకు కొనసాగాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు అలుపెరుగని పోరాటపటిమగలిగిన బీసీల ముద్దుబిడ్డగా బీసీల రాజ్యాధికారం కొరకు నడుము బిగించాలని విజ్ఞప్తి చేసినారు కార్యక్రమంలో బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్ మంచి కట్ల మురళి బుర్ర కుమార్ ఆకుల సదానందం మామునూరు ప్రవీణ్ కుమార్ మంద బిక్షపతి కన్నెబోయిన రాజయ్య సబ్బని రాజేందర్ పిట్ట శ్రీనివాస్ ఎండి బాబా గుడాల రాజారాం మంచి కట్ల విజయ్ పోగు సమ్మయ్య తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు అందజేసి నారు