గురుకులంలో సమస్యలపై పరిశీలనకు వెళ్లిన బీజేపీ నాయకులు

పేపర్ కథనం చూసినా స్పందించని అధికారులు  భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారంటూ ఇటీవల పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ మహిళా మోర్చా అధ్యక్షురాలు నాంపల్లి మమత, గురుకుల పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, ఆహారం నాణ్యత, అల్పాహారం సమయపాలన, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ నాయకులకు గురుకుల ప్రిన్సిపాల్ నుంచి సరైన స్పందన లభించలేదని...