తాత మధుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: ఎమ్మెల్సీ తాత మధుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అడ్డూరి అనిల్ మాదిగ, ఎం ఎస్ పి మండల అధ్యక్షులు కొయ్యడ రాజేందర్ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దళితుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ తాత మధు వెంటనే దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులపై వివక్ష అనుచిత వ్యాఖ్యలను ఇకపై సహించబోమని స్పష్టం చేశారు....