భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: ఎమ్మెల్సీ తాత మధుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అడ్డూరి అనిల్ మాదిగ, ఎం ఎస్ పి మండల అధ్యక్షులు కొయ్యడ రాజేందర్ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దళితుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ఎమ్మెల్సీ తాత మధు వెంటనే దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులపై వివక్ష అనుచిత వ్యాఖ్యలను ఇకపై సహించబోమని స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులను కాపాడాలని కుల వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే చర్యలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పోగుల రమేష్ మాదిగ, జర్నలిస్ట్ ఫోరం మండల అధ్యక్షులు బొంకూరి వంశీ మాదిగ, మండల నాయకులు అడ్డూరి ప్రశాంత్ మాదిగ, ఎమ్మార్పీఎస్ గోపాల్పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు నమిండ్ల నరేష్ మాదిగ, ఎంఎస్పి గోపాల్పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు మంద అనిల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.