BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 4:34 pm Posted by : Reporter Srikanth

కక్షిదారులు సద్వినియోగం చేసుకొవాలి

భీమ్ ఇండియా టుడే న్యూస్ సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ హుస్నాబాద్ నియోజకవర్గం  కోహెడ మండలం సామాజిక కార్యకర్త, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు

సెప్టెంబర్ 12వ, తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో రాజీ అయ్యే అవకాశం ఉన్న కేసులతో పరిష్కరించే వీలున్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని ప్రముఖ సామాజిక కార్యకర్త, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు అన్నారు. 

సెప్టెంబర్ 12వ, తేదీన జిల్లా కోర్టుతో పాటు సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, గజ్వెల్, చేర్యాల, హుస్నాబాద్ లో గల కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తారు.ఇట్టి కార్యక్రమంలో రాజీ ద్వారా పరిష్కరించదగ్గ కేసులను పరిష్కారించడం జరుగుతుంది. కాబట్టి కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించులోని కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ సంవత్సరం మార్చి నెలలో నిర్వహించన లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా 756 కేసులు పరిష్కరించడం జరిగిందని, వాటిలో మోటార్ వాహనాలకు సంబందించిన కేసులో తొబై రెండు లక్షల ఇరవై ఆరు వేల నష్టపరిహారం చెల్లించడం జరిగిందని, బ్యాంక్ కేసులకు సంబందించిన ముప్పై లక్షల ముప్పై రెండు వేల రూపాయలు సెటిల్ చేయడం జరిగిందని అన్నారు. జూన్ లో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా 814 కేసులు పరిష్కారమాయ్యాయని వీటిలో మోటార్ వాహనాలకు సంబందించిన కేసులో డెబ్భై ఏనమిది లక్షల ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ఇప్పించడం జరిగిందని,బ్యాంక్ కేసులకు సంబందించిన ఐదు లక్షల డెబ్భై ఏడు వేల రూపాయల సెటిల్మెంట్ చేయడం జరిగిందని తెలిపారు. ఇవే కాకుండా జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ ద్వారా పోక్స్ కేసులలో భాదితులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు అవార్డు కాగా నాలుగు లక్షల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. సెప్టెంబర్ 12వ, తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా పరిష్కరించేందుకు 1776 కేసులను గుర్తించడం జరిగిందని, వాటిలో 518 మందికి నోటీసులు జారీ చెయ్యడం జరిగిందని, చెక్ బౌన్స్ సంబందించిన 1323 కేసులను గుర్తించి నోటీసులు జారీ చేయడం జరిగింది. కావున సెప్టెంబర్ 12వ, తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పరిష్కరించే వీలున్న కేసులకు సంబందించిన కక్షిదారులు ఇట్టి అవకాశం సద్వినియోగం చేసుకొని లబ్ది పొందాలని పిడిశెట్టి రాజు పేర్కొన్నారు.