ఎల్కతుర్తి సొసైటీ రైతులదే… ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తుల సొంత ఆస్తి కాదు
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి విశాల సహకార సంఘానికి ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు? నామినేటెడ్ పాలన ఎందుకు ఎన్నికలు లేకుండానే చైర్మన్, డైరెక్టర్లను నియమించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం కాదా? అని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎల్కతుర్తి విశాల సహకార సంఘం రైతుల ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన సంస్థ అని, అలాంటి సంస్థలో రైతులకు తమ ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం లేకుండా అధికార పార్టీకి చెందిన నాయకులను నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్, డైరెక్టర్లుగా నియమించడం...