ఘనంగా సహకార సంఘం చైర్మన్ ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం
రైతు సంక్షేమమే ధ్యేయం: ఆధునిక సాంకేతికతతో మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యం భీమ్ ఇండియా టుడే న్యూస్ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సహకార సంఘం చైర్మన్‌గా ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి నియమితులయ్యారు.ఆయనతో పాటు సహకార సంఘం డైరెక్టర్లుగా శనిగరపు స్వరూప,ఎడవల్లి అశోక్‌రెడ్డి,పుల్లూరి నర్సింహారావు,బొమ్మరబోయిన కుమారస్వామి,చిర్ర రాజయ్య,చల్ల ధనలక్ష్మి,మోడం రాజయ్య,ఇనుగాల సుధాకర్,బక్కయ్య,వీరమల్ల ముకుందరెడ్డి,మద్దె రాములు నియమితులయ్యారు.ఎల్కతుర్తి సహకార సంఘం పరిధిలోని రైతులకు అవసరమైన సహకార సేవలను మరింత మెరుగుపరచాల్సిన బాధ్యత నూతన పాలకవర్గంపై ఉంది.రైతులకు పంట రుణాలు,వ్యవసాయానికి అవసరమైన ఎరువులు,విత్తనాలు తదితర సేవలను సకాలంలో అందుబాటులోకి...