ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గారి జయంతి

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ భాష, యాసలోని పదును, ప్రత్యేకతను తన రచనల ద్వారా చాటిచెప్పిన ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా జరుపుకునే తెలంగాణ భాషా దినోత్సవం మనందరికీ ఎంతో ప్రత్యేకమైనది.  ప్రజల భాషలోనే ప్రజల సమస్యలను, ఆకాంక్షలను తన రచనల్లో ప్రతిబింబించిన కాళోజీ తన కలాన్ని సామాజిక చైతన్యానికి సాధనంగా మలిచారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మానవ హక్కుల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం.  తెలంగాణ భాష కేవలం మన...