ప్రజాకవి కాళోజీ ఆశయాలను కొనసాగించడమే మన బాధ్యత

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండల ప్రజా, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాం. తెలంగాణ ప్రజల కష్టాలు, కన్నీళ్లు, ఆకాంక్షలను తన కవిత్వం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు కాళోజీ నారాయణరావు. ప్రజల పక్షాన నిలబడి అన్యాయాన్ని ప్రశ్నించడం, అణగారిన వర్గాల గొంతుకగా నిలవడం ఆయన జీవితానికి ప్రత్యేక గుర్తింపు. కాళోజీ గారి రచనలు కేవలం కవితలు కాదు.. అవి తెలంగాణ ప్రజల జీవన పోరాటానికి అద్దం పట్టిన ఉద్యమ గీతాలు. “నా గొడవ”...