భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండల ప్రజా, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాం.
తెలంగాణ ప్రజల కష్టాలు, కన్నీళ్లు, ఆకాంక్షలను తన కవిత్వం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు కాళోజీ నారాయణరావు. ప్రజల పక్షాన నిలబడి అన్యాయాన్ని ప్రశ్నించడం, అణగారిన వర్గాల గొంతుకగా నిలవడం ఆయన జీవితానికి ప్రత్యేక గుర్తింపు.
కాళోజీ గారి రచనలు కేవలం కవితలు కాదు.. అవి తెలంగాణ ప్రజల జీవన పోరాటానికి అద్దం పట్టిన ఉద్యమ గీతాలు. “నా గొడవ” ద్వారా సమాజంలోని అన్యాయాలు, అసమానతలు, దోపిడీపై ఆయన తనదైన శైలిలో ప్రజలను చైతన్యపరిచారు.
నేటి యువత కాళోజీ గారి జీవితాన్ని, సాహిత్యాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగడమే కాళోజీ గారికి మనం అందించే నిజమైన నివాళి.
కాళోజీ నారాయణరావు గారి జయంతిని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడంతో పాటు, ఆయన సాహిత్యం మరియు ప్రజా ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం, సాహితీవేత్తలు, ప్రజాసంఘాలు మరింత కృషి చేయాలి.ఎమ్మార్వో ఏ.వి.ఎన్.వి ప్రసాద్ రావు డి టి రమేష్ ఏం.ఆర్.ఐ సదానందం ఏ.ఆర్.ఐ భరత్ సీనియర్ అసిస్టెంట్ అనిత టెక్నికల్ అసిస్టెంట్ పవన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు