BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 6:21 pm Posted by : Reporter Srikanth

పాటకు వాటా కావాలి.. చట్టసభలో హక్కు కావాలి

పాటకు వాటా కావాలి.. చట్టసభలో హక్కు కావాలి” అంటూ పాట రూపకంలో ప్రత్యేక ప్రదర్శన

భీమ్ ఇండియా టుడే న్యూస్ భువనగిరి, సెప్టెంబర్ 10:సోమన్న 25 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సెప్టెంబర్ 10, 2026న భువనగిరిలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సోమన్న కోసం తరలివస్తున్న ప్రతి ఒక్కరి ఆకాంక్షలను పాట, ప్రదర్శన, పాట రూపకం ద్వారా ప్రజల ముందుకు తీసుకువచ్చే కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నారు.

పాటకు వాటా కావాలి.. చట్టసభలో హక్కు కావాలి” అనే నినాదంతో కళాకారులు, ప్రజా గాయకులు, అభిమానులు తమ హక్కుల కోసం గళం వినిపించనున్నారు. పాటకు, కళాకారుల కృషికి తగిన గుర్తింపు రావాలనే సందేశాన్ని పాట రూపకంలో ప్రదర్శించనున్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ రిపోర్టర్ పాశం యాదగిరి మీసాల గణేష్ తదితరులు పాల్గొని ప్రజా కళాకారుల హక్కులు, పాటకు సముచిత స్థానం కల్పించాల్సిన అవసరాన్ని వివరించనున్నారు. సోమన్న 25 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయనున్నారు.

సోమన్న కోసం వస్తున్న ప్రతి ఒక్కరి ఆశయాలు నెరవేరాలని, మీసాల గణేష్ చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. పాటతో ప్రదర్శన, ప్రదర్శనతో సందేశం, పాట రూపకంతో హక్కుల గళాన్ని వినిపించేలా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

పాట అనేది కేవలం వినోదం మాత్రమే కాదని, ప్రజల సమస్యలను సమాజం ముందుకు తీసుకెళ్లే శక్తివంతమైన సాధనమని ఈ కార్యక్రమం ద్వారా చాటి చెప్పనున్నారు. “పాటకు వాటా.. చట్టసభలో హక్కు” అనే నినాదం కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.