BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 3:59 pm Posted by : Reporter Srikanth

ఎల్కతుర్తి నూతన సీఐ కొండ్ర శ్రీనును మర్యాదపూర్వకంగా కలిసిన న్యాయవాది గడ్డం విష్ణువర్ధన్

భీమ్ ఇండియా టుడే న్యూస్: ఎల్కతుర్తి పోలీస్‌ సర్కిల్‌ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీ కొండ్ర శ్రీను గారిని న్యాయవాది గడ్డం విష్ణువర్ధన్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ కొండ్ర శ్రీనుకు న్యాయవాది గడ్డం విష్ణువర్ధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎల్కతుర్తి పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు.

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా నూతన సీఐ ప్రత్యేక చొరవ చూపాలని, పోలీస్‌ శాఖ మరియు ప్రజల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.

నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన కొండ్ర శ్రీనుకు పలువురు ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, ప్రముఖులు మరియు స్థానికులు అభినందనలు తెలియజేస్తున్నారు.