మండల స్థాయి క్రీడా ఎంపికలకు సర్వం సిద్ధం
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండల స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడా ఎంపికలకు సర్వం సిద్ధమైంది.సెప్టెంబర్ 9న కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్‌లో ఈ క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ అధ్యక్షుడు,ఎంఈఓ చదువుల సత్యనారాయణ తెలిపారు.కబడ్డీ,వాలీబాల్, ఖో-ఖో క్రీడల్లో అండర్–14,అండర్–17 విభాగాల్లో బాలబాలికలకు ఎంపికలు నిర్వహించనున్నారు. మండలంలోని వివిధ పాఠశాలల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ ఎంపికల్లో పాల్గొననున్నారు.క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు,పిన్ నెంబర్ వివరాలను వెంట తీసుకురావాలని,ఎంపికలకు ఉదయం 9 గంటలకు కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్‌లో హాజరు కావాలని అధికారులు సూచించారు.క్రీడాకారులు సమయపాలనతో హాజరై...