స్పీకర్ గారిపై అత్యంత హేయంగా దుర్భాషలాడిన సభ్యుడిని తక్షణమే అనర్హుడిగా ప్రకటించాలని
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ అసెంబ్లీ గౌరవ శాసనసభ స్పీకర్ గారిపై అత్యంత హేయంగా, అవమానకరంగా, కించపరుస్తూ శాసనమండలి సభ్యుడు మాట్లాడిన తీరును ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శాసనసభ చరిత్రలో ఇదొక చీకటి రోజుగా అభివర్ణించారు. ఈ విషయంలో ప్రతిపక్ష నాయకుడు కే చంద్రశేఖర్ రావు సభకు క్షమాపణలు చెప్పాలని కోరారు. శాసనసభ ప్రాంగణ పరిధిలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడిన విషయాన్ని అసెంబ్లీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లేవనెత్తిన అంశంపై ముఖ్యమంత్రి స్పందించారు. స్పీకర్...