BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 9:13 am Posted by : Reporter Srikanth

సంక్షేమం పేరుతో ప్రజలను ఆధారపడేలా చేయడం కాదు

 భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ 1000 రోజుల కాంగ్రెస్ పాలన మరియు 10 సంవత్సరాల BRS పాలనలో అభివృద్ధి పై శ్వేత పత్రం విడుదల చేయాలి*

ప్రజల పన్నులతో బడ్జెట్.. బహుజనులకు దక్కిందేమిటి

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ గారు

ప్రజలు చెల్లించే పన్నులు, ప్రజల కష్టార్జితంతోనే రాష్ట్ర బడ్జెట్ రూపొందుతోంది. దశాబ్దాలుగా లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించి ఖర్చు చేస్తున్నా, రాష్ట్రంలో పేదరికం, నిరుద్యోగం, అసమానతలు ఎందుకు పెరుగుతున్నాయో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ డిమాండ్ చేశారు.

తెలంగాణలో సుమారు 90 శాతం ఉన్న SC, ST, BC, మైనారిటీ బహుజన వర్గాలకు బడ్జెట్ ద్వారా జరిగిన వాస్తవ ప్రయోజనం ఏమిటో ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించాలి.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల లేమి, దళితుల భూముల ఆక్రమణలు, 22-A పేరుతో భూముల సమస్యలు, మూసీ సుందరీకరణతో పేదలపై పడుతున్న ప్రభావం, RRR–రింగ్‌రోడ్ల పేరుతో భూముల రేట్లు పెంచుకుంటున్న అగ్రకుల పాలకులు,అట్రాసిటీ చట్టం అమలులో వైఫల్యం వంటి సమస్యలకు ఇప్పటికీ శాశ్వత పరిష్కారం ఎందుకు లభించడం లేదో ప్రభుత్వం చెప్పాలి.

అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఉద్యోగాల హామీలు ఎంతవరకు అమలయ్యాయో ప్రజలకు పూర్తి లెక్కలు ఇవ్వాలి.

బీఎస్పీ ప్రధాన డిమాండ్

గత దశాబ్దాలుగా రాష్ట్రానికి వచ్చిన మొత్తం బడ్జెట్, ప్రతి శాఖకు జరిగిన కేటాయింపులు, వాస్తవ ఖర్చులు, SC–ST–BC–మైనారిటీల కోసం చేసిన కేటాయింపులు, వాటి ద్వారా జరిగిన ప్రయోజనాలు, ఉద్యోగాలు, విద్య, వైద్యం, భూములు, సంక్షేమ పథకాలపై మరియు వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన తో పాటు పదేండ్ల బీఆరెస్ అభివృద్ధి పై ప్రభుత్వం వెంటనే సమగ్ర “శ్వేతపత్రం” విడుదల చేయాలి.

ప్రజల సొమ్ముకు ప్రజలకు లెక్క చెప్పాలి.బడ్జెట్‌లు పెరగడం కాదు… బహుజనుల జీవన ప్రమాణాలు పెరగాలి.

సంక్షేమం పేరుతో ప్రజలను ఆధారపడేలా చేయడం కాదు విద్య, ఉద్యోగం, ఆర్థిక స్వావలంబన, రాజకీయ అధికారం కల్పించాలి.ప్రజల పన్నులతో వచ్చిన ప్రతి రూపాయికి ప్రభుత్వం లెక్క చెప్పే వరకు బీఎస్పీ ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటుంది.

చీఫ్ జోన్-1 ఇంచార్జ్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లు తదితరులు పాల్గొన్నరూ