భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్: శాసనసభ ప్రాంగణంలో నూతనంగా రూపుదిద్దుకున్న సెంట్రల్ హాల్‌ను సభా నాయకుడు, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి పేరుతో ఈ సెంట్రల్ హాల్‌కు నామకరణం చేశారు.
సెంట్రల్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితర మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు చిత్రపటానికి ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. శాసనసభ వ్యవస్థకు శ్రీపాదరావు అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు స్మరించుకున్నారు.
అనంతరం ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గౌరవ సభ్యులతో కలిసి సెంట్రల్ హాల్‌లో ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో కొనసాగింది.