తుక్కుగూడలో ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సు హత్యాచారానికి గురైన ఘటన
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ఇటీవల హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సు హత్యాచారానికి గురైన ఘటనను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, బాధితురాలు ఉంటున్న వసతి ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లు, సంబంధిత సంస్థ నిర్వహణలో ఏమైనా నిర్లక్ష్యాలు ఉన్నాయా, మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించి పాటించాల్సిన నిబంధనలు అమలయ్యాయా అన్న అంశాలన్నింటినీ విచారణలో పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితుడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి...