కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి సంస్మరణ సభ
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ రవీంద్ర భారతి. ఆరు దశాబ్దాల పాటు మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వరకు రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం తన జీవితాన్ని సర్వం ధారపోసిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి గారని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కొనియాడారు. రవీంద్రభారతిలో జరిగిన అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి గారి చిత్రపటానికి...