నూతన సీఐ కి శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ నాయకులు
భీమ్ ఇండియా టుడే న్యూస్: ఎల్కతుర్తి మండల కేంద్రానికి నూతనంగా విచ్చేసిన సీఐ కొండ్రు శ్రీనివాస్‌ను బీఆర్‌ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సీఐకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు. ఎల్కతుర్తి మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని నాయకులు ఆకాంక్షించారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎల్కతుర్తి మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్, సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్...