భీమ్ ఇండియా టుడే న్యూస్: ఎల్కతుర్తి మండల కేంద్రానికి నూతనంగా విచ్చేసిన సీఐ కొండ్రు శ్రీనివాస్‌ను బీఆర్‌ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సీఐకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు.
ఎల్కతుర్తి మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని నాయకులు ఆకాంక్షించారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎల్కతుర్తి మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్, సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, మాజీ మండల అధ్యక్షులు యేల్తూరి స్వామి, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు కడారి రాజు, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గొల్లే మహేందర్, సీనియర్ నాయకులు గుండా ప్రతాప్ రెడ్డి, సాతూరి చంద్రమౌళి, అల్లకొండ రాజు, భాష బోయిన సురేష్ యాదవ్, గొల్లిపెళ్లి రవి తదితరులు పాల్గొన్నారు.