భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్ డోలపేటకు చెందిన ముంజేటి స్పందన గారు ఈనెల 4న హత్యకు గురయ్యారు. 16 ఏళ్లు కూడా నిండని కన్న కొడుకే ఈ పనికి పాల్పడ్డాడు.
ఏం జరిగింది:* కారణం:*బుద్ధిగా చదువుకో” అని తల్లి మందలించిందని కోపం.దారుణం:* తల్లిపై 16 సార్లు కత్తితో పొడిచి హత్య చేసి, ఇంటి పక్క చెరువులో పడేశాడు.
ప్లాన్:* ఇంట్లోని బంగారం తీసుకొని ముంబై పారిపోయి మాఫియా గ్యాంగ్‌లో చేరాలని ఆలోచన.అరెస్ట్: స్నేహితుడితో కలిసి తిరుపతిలో దొరికిపోయాడు. రాజాం పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
ఇది చదివాక గుండె తరుక్కుపోతుంది మనిషి
కన్న తల్లి. 9 నెలలు మోసి, కంటికి రెప్పలా కాపాడి, “నా కొడుకు బాగుపడాలి” అని చదువుకోమని చెప్పిన పాపానికి… ఇంత ఘోరమా? 😢
ఏళ్ళు. ఆ వయసులో ఆటలు, చదువు, కలలు ఉండాలి. కానీ సినిమాలు, చెడు స్నేహాలు, ఫోన్ ప్రభావంతో పిల్లలు రాక్షసులుగా మారిపోతున్నారు.
పిల్లల పెంపకం* – ఫోన్ చేతిలో పెట్టి, ఏం చూస్తున్నాడో పట్టించుకోకపోవడం.సమాజం*మాఫియా గ్యాంగ్, రౌడీయిజం” గొప్ప అనే భ్రమ కల్పించే కంటెంట్.విలువలు*తల్లిదండ్రుల మాట వినడం “ఓల్డ్ ఫ్యాషన్” అనుకునే జనరేషన్.చదువుకోమని చెప్పిన తల్లి శత్రువు ఎలా అవుతుంది? బంగారం కోసం కన్న ప్రాణం తీసేంత కసాయి ఎలా తయారవుతాడు?
ఈ ఘటన ప్రతి తల్లిదండ్రులకు, ప్రతి పిల్లాడికి ఒక గుణపాఠం. పిల్లలతో మాట్లాడండి, వాళ్ళ ఫోన్‌లో ఏముందో చూడండి, మంచి చెడు నేర్పండి. లేకపోతే ఇలాంటి స్పందనలు ఇంకెన్నో… 😔
సమాజం_ఎటుపోతోంది
వీలైనంత వరుకు ఈ న్యూస్ అన్ని గ్రూపులో షేర్ చేయండి ఇది చదివైనా తల్లిదండ్రులు జాగ్రత్త పడతారు పిల్లల విషయం లో