విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అమూల్యం:

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల జీవితాలకు దిశానిర్దేశం చేస్తూ, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు పోషిస్తున్న పాత్రను సీఎం కొనియాడారు. సమాజ నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో ఉపాధ్యాయుల సేవలు ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, ఆదర్శ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి ఘన నివాళులు అర్పించారు. విద్యారంగానికి, సమాజానికి డాక్టర్...