భీమ్ ఇండియా టుడే హైదరాబాద్: ‘భూభారతి’లోని లోపాలు, సెక్షన్ 22A పేరుతో రైతులు, పేదల భూములను నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు, రాష్ట్ర శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ.. రైతుల భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చి వారి హక్కులను హరించడం దుర్మార్గమన్నారు. ‘భూభారతి’ లోపాలపై అసెంబ్లీ హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు, భూ బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.