మహిళల వినతికి స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ గ్రామ మహిళలు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతిపత్రం అందజేశారు. మహిళల విజ్ఞప్తికి స్పందించిన మంత్రి సూరారం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హన్మకొండ నుంచి సూరారం గ్రామానికి ట్రయల్‌గా బస్సును నడిపించి, గ్రామానికి బస్సు రాకపోకలకు అనుకూలతను పరిశీలించారు. దీంతో సూరారం గ్రామ ప్రజలు, ముఖ్యంగా మహిళలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తే...