BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 2:33 pm Posted by : Reporter Srikanth

మహిళల వినతికి స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ గ్రామ మహిళలు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతిపత్రం అందజేశారు. మహిళల విజ్ఞప్తికి స్పందించిన మంత్రి సూరారం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో శనివారం హన్మకొండ నుంచి సూరారం గ్రామానికి ట్రయల్‌గా బస్సును నడిపించి, గ్రామానికి బస్సు రాకపోకలకు అనుకూలతను పరిశీలించారు. దీంతో సూరారం గ్రామ ప్రజలు, ముఖ్యంగా మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

గ్రామానికి బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తే విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని గ్రామస్తులు తెలిపారు. తమ విజ్ఞప్తికి స్పందించి బస్సు సౌకర్యం కల్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సూరారం గ్రామ అధ్యక్షుడు బచ్చు శ్రీధర్ రావు, సర్పంచ్ నీల కొమురయ్య, ఉపసర్పంచ్ మేకల బాబు, కుర్ర ప్రకాష్, చల్లూరి వేణు, మహమ్మద్ జావిద్, మొలుగూరి భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్, పి. సంపత్, చత్రపతి, గ్రామపంచాయతీ కార్యదర్శి ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.