BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 12:09 am Posted by : Reporter Srikanth

పలు గ్రామాల్లో CMRF చెక్కుల పంపిణీ

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు చేతుల మీదుగా పంపిణీ

కమలాపూర్: కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు లబ్ధిదారులకు CMRF చెక్కులను అందజేశారు.

అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. వైద్య ఖర్చుల భారంతో ఇబ్బందులు పడుతున్న తమకు CMRF ద్వారా ఆర్థిక సహాయం అందడం ఎంతో ఊరటనిచ్చిందని తెలిపారు. ప్రభుత్వానికి, సహకరించిన కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమ నాగరాజు, మండల అధ్యక్షులు, భీంపల్లి సర్పంచ్ వాసాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.