నిర్మాణాల్లో నాణ్యత, ఇతర సాంకేతిక అంశాల విషయాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట్ చేరుకున్న ముఖ్యమంత్రి వివిధ విద్యా సంస్థల భవన సముదాయాల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా ప్రభుత్వ వైద్య, వెటర్నరీ, నర్సింగ్, పిజియోథెరపీ, పారామెడికల్, ఇంజనీరింగ్ కాలేజీ, 400 పడకల ఆసుపత్రితో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్...