గ్రామాల్లో వాగుల వద్ద కల్వర్టులు, వంతెనల నిర్మాణానికి పకడ్బందీగా ప్రణాళికలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ మక్తల్-నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల #MNKLIS ప్రాజెక్టు ఫేజ్-2 పనులకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచడానికి ప్రతి ఏటా అవసరమైన బడ్జెట్‌కు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. కొడంగల్ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, వాటి పురోగతిపై హకీంపేట్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి  సమీక్షించారు. ఎంఎన్ కేఎల్ఐఎస్ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను పూర్తి చేయాలని...