BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 8:53 pm Posted by : Reporter Srikanth

ఘనంగా శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం: శ్రీ సాయి యూత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ చదిరం వీరస్వామి, మాజీ సర్పంచ్ చిర్ర కొమరవెల్లి, మాజీ ఉపసర్పంచ్ మాదం రాజేందర్, యాదవ సంఘం అధ్యక్షుడు వంగ రవి, ఉపాధ్యక్షుడు ఓం ప్రకాష్, టీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు గుణిగంటి రమేష్, నాయినేని అంజన్ రావు, నాయినేని రఘుపతిరావు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణుడి బోధనలు, ధర్మమార్గం, సత్యనిష్ఠ నేటి సమాజానికి ఎంతో ఆదర్శప్రాయమని అన్నారు. యువత శ్రీకృష్ణుడి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

శ్రీ సాయి యూత్ సభ్యులు, యాదవ సంఘం నాయకులు, గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.