గుట్టలను అక్రమంగా తవ్వి మట్టి/గ్రావెల్ తరలిస్తున్న ఘటనలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లాలోని చిట్యాల మండలం, నవాబుపేట శాంతినగర్ గ్రామ పరిధిలో గుట్టలను అక్రమంగా తవ్వి మట్టి/గ్రావెల్ తరలిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా కొంతమంది వ్యక్తులు రాత్రి వేళల్లో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి, లారీలు ద్వారా మట్టి తరలిస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మరియు స్థానిక మండల పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి గత నెల 15...