భీమ్ ఇండియా టుడే న్యూస్జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లాలోని చిట్యాల మండలం, నవాబుపేట శాంతినగర్ గ్రామ పరిధిలో గుట్టలను అక్రమంగా తవ్వి మట్టి/గ్రావెల్ తరలిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా కొంతమంది వ్యక్తులు రాత్రి వేళల్లో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి, లారీలు ద్వారా మట్టి తరలిస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మరియు స్థానిక మండల పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి గత నెల 15 రోజుల నుండి ఈ అక్రమ గుట్టల తవ్వకాల గురించి పర్యవేక్షిస్తూ సదరు తవ్వకాలు చేస్తున్న వారి లారీలను పలుమార్లు అడ్డగించి మీ అనుమతి మీ అనుమతులు చూపించాలని అడుగగా ఏ విధమైన అనుమతులు చూపించకుండా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు
గుట్టలు అవ్వాలంటే పట్టా భూమి అయినా కూడా పర్యావరణ అనుమతులు వాల్టా చట్టం ప్రకారం వారికి అనుమతులు లేవు మేము జిల్లా మైనింగ్ అధికారులను ప్రశ్నించడం జరిగింది పర్యావరణ అనుమతులు ఉన్నాయని మండల రెవెన్యూ అధికారి గారిని ఎన్ఓసి ఇచ్చారని రాత్రి వేళల్లో లారీలకు పర్మిషన్ తవ్వకాలకు పర్మిషన్ లారీ పాస్ లేకుండా గ్రామ ప్రజలకు సమాచారం ఇవ్వకుండా ఎలాంటి బోర్డులు లేకుండా తవ్వకాలు చేస్తున్నారు
జిల్లా పర్యావరణ అనుమతులు మరియు రాష్ట్ర పర్యావరణ అనుమతులు లేవు లారీలు వెళ్తుంటే రోడ్డుపైన విపరీతమైన దుమ్ము లేవడం వల్ల రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు రోడ్డుమీద నీళ్లు కొట్టడం లేదు పెద్ద శబ్దాలు గాలిలో దుమ్ము లేచి వాయు కాలుష్యం విపరీతంగా పెరగడం వల్ల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని ప్రజలు చెప్పడం జరిగింది
వాల్టా చట్టం గుట్టల పరిరక్షణ కోసం వారి అనుమతులు తీసుకోవాలి కానీ ఈ అనుమతులు లేకుండా జిల్లా మైనింగ్ అధికారులు వారికి తవ్వాల కోసం కొంతమేర అనుమతులు ఇచ్చినట్టు వారు పేపర్ చూపిస్తున్నారు ఇది పూర్తిగా తప్పుగా మేము ప్రజలు భావిస్తున్నారు పర్యావరణ పరిరక్షణ కోసం ఎంత దూరమైనా పోరాటానికి టిఆర్పి పార్టీ సిద్ధంగా ఉంటుంది అని హెచ్చరించారు
ఈ అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోంది. గుట్టలు నాశనం కావడం వల్ల భూసార నష్టం, భూగర్భ జలాలపై ప్రతికూల ప్రభావం, అలాగే గ్రామ ప్రజల జీవన విధానంపై దుష్ప్రభావం పడుతోంది.
ప్రభుత్వానికి రావలసిన ఆదాయం దోపిడీ అవుతున్నదే కాకుండా, చట్టాలకు విరుద్ధంగా ఈ కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కావున జిల్లా కలెక్టర్ గారు, మైనింగ్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి: అక్రమ తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని రికవరీ చేయాలిలేదంటే స్థానిక ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో టిఆర్పి చిట్యాల మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.