మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ పోరుబాట.. డీలిమిటేషన్‌తో ముడిపెట్టొద్దని డిమాండ్‌

మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ పోరుబాట.. డీలిమిటేషన్‌తో ముడిపెట్టొద్దని డిమాండ్‌ భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్: మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. మహిళా రిజర్వేషన్ల అంశాన్ని నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌)తో ముడిపెట్టడం వల్ల మహిళలకు రిజర్వేషన్లు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయడానికి కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని, అయితే నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని...