భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్, సెప్టెంబర్ 3: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించడంతో పాటు రాజీనామా చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇటీవల కొండా సురేఖ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది.
అయితే, మంత్రి పదవికి రాజీనామా చేయడంపై కొండా సురేఖ ఎలా స్పందిస్తారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధిష్ఠానం ఆదేశాలను ఆమె పాటిస్తారా? లేక తన వైఖరిని కొనసాగిస్తారా? అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అధికారిక స్పష్టత వచ్చిన తర్వాతే మంత్రి పదవికి సంబంధించిన పరిణామాలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.