BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 5:02 pm Posted by : Reporter Srikanth

ఇంటర్కనెట్ కనెక్షన్ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేసుకునేలా

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ఇంటర్కనెట్ కనెక్షన్ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేసుకునేలా ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్‌పే ‘UPI 123Pay’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా 2G నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లోనూ డిజిటల్ చెల్లింపులు సులభంగా చేసుకునేలా ఈ సేవను రూపొందించింది.

SMS ఆధారంగా పనిచేసే ఈ సదుపాయం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులకు యూపీఐ చెల్లింపుల సౌకర్యం అందుబాటులోకి రానుంది. స్మార్ట్‌ఫోన్ లేదా మొబైల్ డేటా అవసరం లేకుండానే చెల్లింపులు చేసుకునే అవకాశం కల్పించడం దీని ప్రత్యేకత.
అంతేకాకుండా కొత్త ఫీచర్ ఫోన్లలో ఈ సదుపాయం ముందుగానే అందుబాటులో ఉండేలా నోకియా, లావా వంటి మొబైల్ తయారీ సంస్థలతో ఫోన్‌పే ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సేవ ద్వారా క్యూఆర్ కోడ్ స్కానింగ్, నగదు చెల్లింపులు, ఖాతా బ్యాలెన్స్ చెకింగ్ వంటి వివిధ యూపీఐ సేవలను వినియోగించుకోవచ్చు.
గ్రామీణ ప్రాంతాలు, తక్కువ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోని ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఈ సేవ మరింత ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది.