Date of Publish : 02 September 2026, 4:35 pmPosted by : Reporter Srikanth
1000 రోజుల కాంగ్రెస్ పాలనపై హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ భారీ నిరసన
420 హామీలు – 420 ఫిట్లు’ ఫ్లెక్సీతో ఆందోళన.. కాంగ్రెస్ బాకీ కార్డుతో ప్రజల్లోకి ప్రచారంఆరు గ్యారెంటీలు పచ్చి మోసం.. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలను వెంటనే చెల్లించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్, సెప్టెంబర్ 2: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తైన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో దాదాపు 3,000 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా “420 హామీలు – 420 ఫిట్లు” అనే భారీ ఫ్లెక్సీని ప్రదర్శించి నిరసన తెలిపారు. అనంతరం **“కాంగ్రెస్ బాకీ కార్డు”**ను ప్రజలకు పంపిణీ చేస్తూ ప్రభుత్వం అమలు చేయని హామీలపై విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు దేవాలయాల్లో దేవుడి సాక్షిగా ప్రమాణాలు చేసి ప్రజలకు గ్యారెంటీ కార్డులు అందజేశారని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి నేడు దాదాపు వెయ్యి రోజులు గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. “వచ్చే నెల.. 100 రోజులు” అంటూ ప్రజలను నమ్మించి ఇప్పుడు మాట తప్పారని ఆరోపించారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, రైతులకు రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ, వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెంచిన పింఛన్లు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డులు, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ వంటి హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆరోపించారు. ప్రజలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు హుజురాబాద్ వన్నాల శివాజీ, బిఆర్ఎస్ కార్యకర్తలు రాంపూర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,సూరి కొంటి రాజిరెడ్డి ,కసరబోయిన, రాజ్ కుమార్, హరీష్, హేమంత్, కోటి, తదితరులు పాల్గొన్నారు