దండేపల్లి గ్రామంలో ఎస్సీ పంబాల సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ
ఘనంగా పంబాల వారి బోనాల పండుగ భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాల సమర్పణ భీమ్ ఇండియా టుడే ఎల్కతుర్తి దండేపల్లి గ్రామంలో ఎస్సీ పంబాల సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామంలో పండుగ సందడి నెలకొనగా, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు, సంప్రదాయ కార్యక్రమాలతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బోనాల సందర్భంగా ఉదయం నుంచే పంబాల కుటుంబాలు తమ ఇళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని, నైవేద్యాలు...