పిహెచ్‌డీ దిశగా గొల్లూరి సుప్రియ ప్రస్థానం
మాణిక్యపూర్ గ్రామానికి విద్యా కీర్తి. PHD దిశగా గొల్లూరి సుప్రియ ప్రస్థానం.. తల్లిదండ్రుల ఆశయాలకు ప్రతిరూపంగా ఎదుగుతున్న విద్యార్థిని భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ మాణిక్యపూర్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభకు కొదవ లేదని, పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపిస్తూ మాణిక్యపూర్ గ్రామానికి చెందిన గొల్లూరి సుప్రియ ఉన్నత విద్యాభ్యాసంలో ముందుకు సాగుతున్నారు. చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి, క్రమశిక్షణ, పట్టుదలతో విద్యను అభ్యసిస్తూ ప్రస్తుతం పీహెచ్‌డీ స్థాయి విద్యకు అర్హత సాధించే స్థాయికి చేరుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విద్యలను అభ్యసించి,...