బదిలీపై వెళ్తున్న సీఐ పులి రమేష్‌కు ఘన వీడ్కోలు

సేవలను గుర్తు చేసుకుంటూ అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తల భావోద్వేగం భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: ఎల్కతుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన సీఐ పులి రమేష్ బదిలీపై వెళ్తుండటంతో మండల కేంద్రంలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సీఐ పులి రమేష్ తన విధుల నిర్వహణలో ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేశారని నాయకులు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి...