ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలను – విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలను – భాగస్వామ్యాలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్‌ ను భారతదేశంలోనే తొలి, అతిపెద్ద గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్ధమైన కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. ఇటీవల యూకే, అమెరికా పర్యటనలో సాధించిన పురోగతిపై తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి  సమీక్షించారు.  ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలను - విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలను - భాగస్వామ్యాలు, ఆఫ్‌షోర్ క్యాంపస్‌ల ద్వారా హైదరాబాద్‌కు తీసుకురావడానికి ప్రభుత్వం అత్యంత అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి  చెప్పారు. తద్వారా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా...