ప్రణబ్ ముఖర్జీ సేవలు దేశానికి చిరస్మరణీయం

వర్ధంతి సందర్భంగా భారతరత్నకు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 31: మాజీ రాష్ట్రపతి, భారతరత్న స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశ నిర్మాణంలో ప్రణబ్ ముఖర్జీ అందించిన విశిష్ట సేవలను, ప్రజాజీవితంలో ఆయన చేసిన అమూల్యమైన కృషిని సీఎం స్మరించుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ భారత రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞులైన నాయకుల్లో ఒకరుగా దేశానికి విశేష సేవలు అందించారని ముఖ్యమంత్రి...