మంత్రి పార్థసారథి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు లతో ఎంపీ ఆత్మీయ సమావేశం.ఎంపీ పుట్టా మహేష్ తో మాజీ ఎంపీ మాగంటి బాబు భేటీ.
భీమ్ ఇండియా టుడే న్యూస్ ప్రతి నెలా ఒక ప్రజా ప్రతినిధి నివాసంలో సమావేశం విధానం బాగుందని అభిప్రాయపడిన నేతలు.
అతిథులకు తన కొత్త నివాసం, కార్యాలయ భవనాన్ని తిరిగి చూపించిన ఎంపీ.
ఏలూరు, సెప్టెంబర్ 01: ఏలూరు ఎంపీతో జిల్లా ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశాలు కొనసాగుతున్నాయి. వట్లూరు పరిధిలోని సీతాపురం కాలనీలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నూతనంగా నిర్మించిన నివాసం, క్యాంపు కార్యాలయాలలో అది, సోమవారాలలో జరిగిన ఆత్మీయ విందుకు పలువురు ఎమ్మెల్యేలు హాజరు కాగా, మంగళవారం రోజు మంత్రి పార్థసారథి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు,మాజీ ఎంపీ మాగంటి బాబు, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గృహాన్ని సందర్శించారు.
ముందుగా ఉదయం 10 గంటల సమయంలో మాజీ ఎమ్మెల్సీ కమిలి విఠల్ రావు ఎంపీ నివాసానికి వచ్చారు. 11గంటల సమయంలో వచ్చిన మాగంటి బాబు, ఎంపీతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. బ్రేక్ఫాస్ట్ అనంతరం ఇరువురు నాయకులు కాసేపు జిల్లా రాజకీయాలపై మనసు విప్పి స్నేహపూరిత వాతావరణంలో మాట్లాడుకున్నారు. అనంతరం మాగంటి బాబు, విఠల్ రావులకు తన నూతన గృహం, కార్యాలయ భవనం మొత్తం తిప్పి చూపించిన ఎంపీ, శాలువాతో సత్కరించిన ఘనంగా వీడ్కోలు పలికారు.
మధ్యాహ్నం 1.00 సమయంలో ఏలూరు ఎంపీ నివాసానికి చేరుకున్న మంత్రి పార్థసారథికి ఎంపీ సాదర స్వాగతం పలికారు. రాబోవు స్థానిక ఎన్నికలు, జిల్లా రాజకీయాలపై కాసేపు మాట్లాడుకున్న ఎంపీ, మంత్రి కలిసి భోజనం చేశారు. ఈ విధంగా ప్రతి నెలా ఒక ప్రజా ప్రతినిధి నివాసంలో సమావేశం అవుతూ మనసు విప్పి మాట్లాడుకునే విధానంలో నాయకుల మధ్య అభిప్రాయ బేధాలుంటే తొలగిపోయి సమన్వయం పెరుగుతుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఎంపీ నివాసంలో దాదాపు ఒక గంట సమయం గడిపిన మంత్రి పార్థ సారధి మధ్యాహ్నం 2.30 సమయంలో అనకాపల్లి బయలుదేరి వెళ్లారు. మంత్రి పార్థ సారథిని శాలువా, జ్ఞాపికలతో సత్కరించిన ఎంపీ, వాహనం వరకూ వచ్చి మంత్రికి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం వివిధ సమస్యలపై తనను కలవడానికి వచ్చిన ప్రజల నుంచి ఎంపీ వినతిపత్రాలు స్వీకరించారు.
సోమవారం సాయంత్రం ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, మాజీ మంత్రి పీతల సుజాత కూడా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో తన
నివాసానికి వచ్చిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును ఆత్మీయంగా పలకరించారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. తేనీరు సేవిస్తూ ఇద్దరూ కొద్దిసేపు పోలవరం ప్రాజెక్టు సహా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, కూటమి నేతల మధ్య సమన్వయం, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.